1.10 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట డివిజన్ లోని 300 మంది లబ్ధిదారులకు 1 కోటి 10 లక్షలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అందించారు. వివిధ కారణాలతో ఆసుపత్రి లో చికిత్స పొంది సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గానికి చెందిన 300 మందికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 300 మందికి 1 కోటి 10 లక్షల చెక్కులను అందించినట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్, మార్కెట్ ఛైర్మెన్ పాలాయి శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ , నర్సంపేట పట్టణ అధ్యక్షుడు రాజేందర్, కౌన్సిలర్ పొన్నం నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.