విద్యుత్ అల్యూమినియం వైర్ దొంగలు అరెస్టు

విద్యుత్ అల్యూమినియం వైర్ దొంగలు అరెస్టు

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ నియోజకవర్గం గరిడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ శాఖకు చెందిన 33 కేవీ విద్యుత్ లైన్ అల్యూమినియం తీగను దొంగిలించిన కేసులో 6 గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు చేసినట్లు సీఐ చరమందరాజు తెలిపారు. పోలీస్ సర్కిల్ కార్యాలయంలో కేస్ వివరాలు మీడియాకు వివరిస్తూ.. గరిడేపల్లి ఎస్ఐ ఆధ్వర్యంలో పొనుగోడు క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ఆటోలో ప్రయాణిస్తూ అనుమానాస్పదంగా పట్టుబడిన నిందితులు 1.లునావత్ అశోక్, 2.లూనావత్ సైదులు, 3.లునావత్ నెహ్రూ, 4.లునావత్ సురేష్, 5.ధరావత్ ప్రసాద్, 6.దరావత్ కుమార్ లను అదుపులోకి తీసుకొని విచారించగా తామే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు.

వారి వద్ద నుండి చోరీ కాబడిన 217 కేజీల విద్యుత్ అల్యూమినియం తీగ, నేరానికి ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. విద్యుత్ సంబంధిత పరికరాలు తీగల దొంగతనం తీవ్రమైన నేరమని దీని వలన ప్రజా జీవనానికి, వ్యవసాయానికి తీవ్ర అంతరాయం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ చరమందరాజు హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

Leave a Reply