POLICE | పోలీస్ శాఖకు బొలెరో నియో వాహనం
ఎంపీ నిధులతో ఏర్పాటు
POLICE |నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : శాంతిభద్రతల నిర్వహణ మరియు నేర నియంత్రణ కోసం, ఎంపీ నిధుల నుంచి పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్‌కు శాంతిభద్రతల నిర్వహణ, నేర నియంత్రణ కోసం ఒక బొలెరో నియో వాహనాన్ని గురువారం అందజేశారు. పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి లాంఛనప్రాయంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు సహాయం అందించడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ప్రజా భద్రతను మెరుగుపరచడానికి, పోలీసు శాఖను బలోపేతం చేయడానికి ఈ వాహనాన్ని అప్పగించామన్నారు. ఈ వాహనం ప్రత్యేకంగా పెట్రోలింగ్, చిన్న పిల్లలు, మహిళల భద్రత, అత్యవసర కాల్‌ల కోసం ఏర్పాటు చేయబడిందన్నారు. ఈ ప్రభుత్వం మహిళలు, పిల్లల భద్రత కోసం ప్రత్యేకంగా శక్తి యాప్ సేవలను రూపొందించిందని, అంటే పాఠశాలలు, కళాశాలలలో పెట్రోలింగ్, ఈవ్-టీచింగ్, లైంగిక వేధింపులు, బలవంతపు బాల్య వివాహం, గృహ హింస బెదిరింపులు మొదలైన ఇటువంటి అత్యవసర సేవలకు వివాహనాన్ని ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. ఈ వాహనాన్ని పోలీసు అధికారులు సంఘటన స్థలానికి వెంటనే చేరుకుని బాధితులకు సహాయం చేయడానికి ఉపయోగిస్తారన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
