Chevella | ఎన్ హెచ్ 163పై రోడ్డు ప్రమాదం

Chevella | ఎన్ హెచ్ 163పై రోడ్డు ప్రమాదం

స్వల్ప గాయాలతో బయటపడ్డ టిప్పర్ డ్రైవర్


Chevella | చేవెళ్ల, ఆంధ్రప్రభ : హైదరాబాద్ – బీజాపూర్ (Hyderabad-Bijapur) జాతీయ రహదారిపై చేవెళ్ల మండలం ఖానాపూర్ గేట్ వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్ (Vikarabad) వైపు నుంచి చేవెళ్ల కు వస్తున్న టిప్పర్ (tipper) అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ వడ్డే శ్రీరామ్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఇటీవల మిర్జాగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మరణించిన విషయం తెలిసిందే.

Leave a Reply