Bhogapuram | ఒకే వేదికపై భారీ ప్రాజెక్టుల ప్రారంభం..
సెమీకండక్టర్ నుంచి ఎక్స్‌ప్రెస్‌వే వరకు
ఏపీ అభివృద్ధికి మరో భారీ అడుగు
భోగాపురం నుంచి అభివృద్ధి పరుగు
ఏపీకి అభివృద్ధి ఊపు
Bhogapuram | భోగాపురం, ఆంధ్రప్రభ : భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మొత్తం రూ.18 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
విశాఖపట్నం తుర్లవాడలో ఏర్పాటు కానున్న ఏఎస్ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్-టెస్టింగ్ యూనిట్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ రంగ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలవనుంది. అలాగే కర్నూలు జిల్లాలోని విండ్-సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను ప్రారంభించారు. అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.
రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు పలు జాతీయ రహదారి ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పారిశ్రామిక, విద్యుత్, రవాణా రంగాల అభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదపడనున్నాయి.
