స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చొరవలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ గ్యారెంటీ నిబంధనలను సవరించింది.
ఈమేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ నోటిఫికేషన్ జారీ చేశారు. 2018లో తీసుకొచ్చిన ఏపీ పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ గ్యారంటీ నిబంధనలను సవరిస్తున్నట్టు పేర్కొన్నారు.
పారిశ్రామిక, వాణిజ్య నిర్మాణాలలో ఉపయోగించే లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల ఉత్పత్తి, సంస్థాపన లైసెన్స్‌లు 15-21 రోజుల్లో జారీ చేసేలా సర్వీస్ డెలివరీ గ్యారెంటీ నిబంధనలలో మార్పులు చేశారు.