పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలి..

పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలి..
ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన
కంచికచర్ల, ఆంధ్రప్రభ : పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ మంగళవారం కంచికచర్ల తహసిల్దార్ కార్యాలయం వద్ద ఐయప్టియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రజలపై భారం మోపే పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఈ సందర్బంగా ఐఎఫ్టియు కంచికచర్ల మండల ప్రధాన కార్యదర్శి జి హరికృష్ణ రెడ్డి మాట్లడుతూ ప్రజలపై భారం మోపే ధరలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలని, పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల వల్ల నిత్యావసర ధరలు పెరిగి ప్రజలపై మరింత భారం పడుతున్నదన్నారు.
యుద్ధం కారణంగా వచ్చిన సంక్షోభాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టలేని ప్రభుత్వం, ప్రజలను పొదుపు కొనసాగించాలని మాట్లాడటం, కూటమి నాయకులు ఒకరోజు సైకిల్ పై వెళ్తే ధరలు నియంత్రించినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. ఇంధన ధరలు పెంపు కారణంగా రాబోయే రోజుల్లో అన్ని రకాల నిత్యావసర సరుకుల పెరిగి సామాన్యులపై భారం పడుతుందని అన్నారు. అమెరికా నియంత్రణలో భారత పాలన సాగటం దురదృష్టకరంఅని, దేశ ప్రజల మౌలిక సౌకర్యాలు కంటే కార్పొరేట్ల, సామ్రాజ్యవాదుల లాభాలు చేకూర్చే పాలకులను ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఆర్ఐకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కంచికచర్ల మండల ఐ ఎఫ్ టి యు అధ్యక్ష కార్యదర్శులు లక్కిశెట్టి ఆంజనేయులు, జి హరికృష్ణ రెడ్డి, బండారి శీను, తాటికొండ వీరయ్య, కాశిబోయిన రాంబాబు, ఐఎఫ్టియు జిల్లా కమిటీ సభ్యులు మర్రిపూడి చిన్న, వెంకటేశ్వరరావు, జెర్రిపోతుల శీను, తోట కృష్ణ, ఉప్పుతల శ్రీను, వెంకటకృష్ణ, కంభంపాటి మాధవరావు, పల్లె రాయప్ప, జిన్నేపల్లి స్వామి, ఎండ్రాతి కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
