నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించాలి

  • జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
  • ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 154 అర్జీలు

నరసరావుపేట, ఆంధ్రప్రభ: నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక ​జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 154 అర్జీలు అందాయని కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని నిబంధనల ప్రకారం నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించి బాధితులకు తగిన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.