అచ్చంపేటలో అంబలి కేంద్రానికి ప్రజల ప్రశంసలు…

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట పట్టణంలో రక్షిత మహిళా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంబలి–మంచినీటి కేంద్రం సోమవారం నాటికి 50 రోజుల సేవా ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. మండుటెండల్లో బాటసారులు, కార్మికులు, పేద ప్రజలకు చల్లని అంబలి, మంచినీరు అందిస్తూ ఈ కేంద్రం ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతిరోజూ సుమారు 600 మందికి పైగా బాటసారులు మండుటల్లో తమ దాహార్తిని తీర్చుకుంటున్నట్లు రక్షిత మహిళా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు చేపూరి జయమ్మ తెలిపారు.

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు. మరికొన్ని రోజుల పాటు మాత్రమే ఈ కేంద్రం కొనసాగనున్న నేపథ్యంలో దాతలు ముందుకు వచ్చి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గత 50 రోజులుగా సహాయ సహకారాలు అందించిన దాతలు, సేవా భావంతో తోడ్పడిన ప్రతి ఒక్కరికీ రక్షిత మహిళా సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంస్థ వ్యవస్థాపకురాలు చేపూరి జయమ్మ, అధ్యక్షురాలు శ్రీరామదాసు రాధిక, ప్రధాన కార్యదర్శి దమ్మోజు మాధవీలత, కోశాధికారి పంబ అంజలి ఆధ్వర్యంలో సభ్యులు గిరిజ, హరిత, జ్యోతి, కళమ్మ, అనిత, నాగలక్ష్మి, మంజుల, వసంత, భారతి, మంగమ్మ, సువర్ణ, పద్మ తదితరులు సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

Leave a Reply