ఇసుక ట్రాక్టర్ పట్టివేత…

- ఇద్దరిపై కేసు నమోదు
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తున్న వ్యక్తులను నారాయణపేట జిల్లా ఊట్కూర్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఎస్సై రమేష్ అందించారు.
ఊట్కూర్ మండల కేంద్రంలో పోలీసులు ప్యాట్రోల్ నిర్వహిస్తున్న సమయంలో, పంచు మసీదు ప్రాంతంలో ఒక ఇసుక ట్రాక్టర్ ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలించడాన్ని గుర్తించారు. దీంతో ట్రాక్టర్ యజమాని సాకలి బాపురం శ్రీను, డ్రైవర్ రాముని పట్టుకుని వారిపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
