అమ్మ చెంత పులకించిన భక్తజనం..
బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : వేసవి సెలవులు అధికమాసం శుక్రవారన్ని పురస్కరించుకొని అమ్మవారి చెంత భక్తజనం పులకించింది. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. గోదారి తీరం భక్తజన సందోహంగా మారింది. ఒకటవ ఘాట్ నుండి గంగ హారతి ఘాట్ వరకు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సెలవులు దగ్గర పడుతుండడం పాఠశాలలు ప్రారంభం కానున నేపథ్యంలో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు భక్తులు పోటెత్తారు.
ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవారి దర్శనం క్యూలైన్లు భక్తులతో కీటకీటలాడాలి. అమ్మవారి దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలయ అధికారులు భక్తుల సేవలో నిమగ్నమయ్యారు. భక్తుడు తమ చిన్నారులకు ఆలయ సన్నిధిలోని అక్షరాభ్యాస మండపాలలో ఆలయ అర్చకులచే అక్షరాభ్యాస పూజలు జరిపించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా హోంగార్డులు ఆలయ సిబ్బంది పోలీసులు సేవలు అందజేశారు.
