Parlament | మహిళా రిజర్వేషన్లపై ఆలస్యం వద్దు ‌‌– ప్రధాని నరేంద్ర మోదీ

Parlament | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని, చట్టసభల్లో వారు బలంగా గళమెత్తే సమయం వచ్చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపు విషయంలో జరుగుతున్న ఆలస్యం వారికి చేసే అన్యాయమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు దేశంలోని మహిళలను ఉద్దేశించి ప్రధాని ఒక బహిరంగ లేఖ రాశారు.

మహిళా సాధికారతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపిన ప్రధాని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కీలక అడుగు వేయబోతున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 16 నుంచి మూడు రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ‘నారీ శక్తి వందనం అధినియమ్’ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించడం ద్వారా రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యాన్ని పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు.

రిజర్వేషన్ల అమలులో జాప్యం జరిగితే అది మహిళా లోకానికి తీరని నష్టం కలిగిస్తుందని మోదీ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరగడం అనేది కేవలం రాజకీయ అంశం కాదని, అది దేశ అభివృద్ధికి అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక బిల్లుకు అందరూ మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు.

మహిళా రిజర్వేషన్లపై ఆలస్యం వద్దు ‌‌– ప్రధాని నరేంద్ర మోదీ

దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని, చట్టసభల్లో వారు బలంగా గళమెత్తే సమయం వచ్చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపు విషయంలో జరుగుతున్న ఆలస్యం వారికి చేసే అన్యాయమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు దేశంలోని మహిళలను ఉద్దేశించి ప్రధాని ఒక బహిరంగ లేఖ రాశారు.

Leave a Reply