Panchayat Elections | అలా చేస్తే.. కష్టాలు తీరుస్తా..
Panchayat Elections | అలా చేస్తే.. కష్టాలు తీరుస్తా..
Panchayat elections, కెరమెరి, ఆంధ్రప్రభ : తొలిసారిగా ప్రజాసేవకు అంకితమవుదామనే ఉద్దేశ్యంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. సర్పంచ్ అభ్యర్థిగా మీ ముంగిటకు వస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో కత్తెరకు ఓటేసి తనను గెలిపిస్తే.. ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటాను.. వారి కష్టాలను తీరుస్తానని అంటున్నాడు గోయగావ్ సర్పంచ్ అభ్యర్థి సిడాం పాండురంగ్. కొమురం భీం ఆసిఫాబాద్ (Kumuram Bheem Asifabad) జిల్లా కెరమెరి మండలంలోని గోయగావ్ గ్రామానికి చెందిన పాండురంగ్ తొలిసారిగా ఎన్నికల బరిలోకి నిలుస్తున్నాడు. టీఆర్ఎస్ మద్దతు కూడగట్టుకుని ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్, ప్రజల సహకారంతో నామినేషన్ వేశాడు.
నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం పాండురంగ్ కు అధికారులు కత్తెర గుర్తు కేటాయించారు. ఈ గుర్తు పై పోటీ చేస్తున్న పాండురంగ్ ప్రజలు తనను ఆదరిస్తే గ్రామంలో మంచినీటి సమస్య తీర్చడానికి కృషి చేస్తానని ‘ఆంధ్రప్రభ’తో వెల్లడించారు. గ్రామంలో ప్రత్యేకంగా బోర్లు వేయించి కుళాయిల ద్వారా ఇంటింటికి నీటి సరఫరా చేసేందుకు తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా గ్రామానికి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించడానికి సైతం అంకితభావంతో కృషి చేస్తారని స్పష్టం చేశారు. సర్పంచిగా అవకాశం కల్పిస్తే.. గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని కూడా పాండురంగీ సందర్భంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
