TG | డ్రగ్స్ కేసు ఆరోపణలు… సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్ !
డ్రగ్స్ కేసులో తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వడానికి తాను కట్టుబడి ఉన్నానని, ఇక నుంచి తాను మౌనంగా ఉండనని స్పష్టం చేశారు.
తనపై డ్రగ్స్ కేసుల్లో దర్యాప్తు జరుగుతోందని రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఆధారమేంటి అని ప్రశ్నిస్తూ, ఎటువంటి సాక్ష్యం ఉన్నా బయటకు తేవాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
‘‘నాపై ఒక్క కేసు కూడా నమోదైందా? కనీసం ఒక ఆధారం ఉన్నదా? ఉంటే చూపించండి. లేకుంటే ఇది మీ చీప్, అసభ్యమైన, నిరాధార కథనమని ఒప్పుకోండి,’’ అని కేటీఆర్ తేల్చి చెప్పారు.
తనను ఎదుర్కొనే ధైర్యం రేవంత్‌కి లేదని, అందుకే ఢిల్లీ వెళ్లి మీడియా చిట్‌చాట్ (Media Chitchat) పేరుతో వెనకటి మాటలు మాట్లాడుతున్నాడని కేటీఆర్ ఆరోపించారు. చిట్‌చాట్స్ రూపంలో అసత్య ఆరోపణలు (False accusations) చేసి చట్టపరమైన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
‘‘ఇకపై వెనక్కి తగ్గేది లేదు. రేవంత్‌రెడ్డి… నిన్ను కోర్టుకు లాగి ఒక్కో అసత్య వ్యాఖ్యకు చట్టపరంగా బుద్ధి చెబుతాను,’’ అని కేటీఆర్ హెచ్చరించారు. రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పారు.
