suicide| అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య..

suicide| బిక్కనూర్, ఆంధ్రప్రభ : కుటుంబ పోషణ కోసం చేసిన అప్పుడు తీర్చలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో చేటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చిట్టబోయిన అంజయ్య తన కుటుంబ పోషణతో పాటు వ్యవసాయం కోసం అప్పులు చేసినట్లు తెలిపారు. ఆయన చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో ఆయన శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులో గల చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందినట్లు వివరించారు. అతనికి భార్యా పిల్లలు ఉన్నారన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.