వైసీపీ నేత మేడ రమేష్ మృతి పట్ల అవినాష్ దిగ్భ్రాంతి…

వైసీపీ నేత మేడ రమేష్ మృతి పట్ల అవినాష్ దిగ్భ్రాంతి…

గాంధీనగర్ రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడిచిన వైసీపీ నేత
పార్టీకి తీరని లోటు అంటూ దేవినేని అవినాష్ ఆవేదన
నిస్వార్థ సేవలతో గుర్తింపు పొందిన ఎస్టీ సెల్ నాయకుడు
కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన జిల్లా అధ్యక్షుడు అవినాష్

విజయవాడ, ఆంధ్రప్రభ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ మెడ రమేష్ విజయవాడ గాంధీనగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపిందని ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో అవినాష్ మాట్లాడుతూ, పార్టీ కోసం మేడ రమేష్ నిస్వార్థంగా పనిచేసి నాయకత్వానికి, కార్యకర్తలకు ఎంతో దగ్గరయ్యారని పేర్కొన్నారు.

ఆయన సేవలు పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. మేడ రమేష్ ఆకస్మిక మృతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్న అవినాష్, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు.

Leave a Reply