OOTKUR | దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం
OOTKUR |దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం
OOTKUR | ఊట్కూర్, ఆంధ్రప్రభ : వ్యక్తి నిర్మాణం దేశ నిర్మాణమే రాష్ట్రీయ స్వయంసేక్ లక్ష్యం అని సామాజిక సమరసత జిల్లా కన్వీనర్, దుంపనర్సింగప్ప (Dumbanarsingappa) అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతజయంతి వేడుకల్లో భాగంగా జనజాగరణ ఇంటింటి కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జరిగిన మార్పు సేవా కార్యక్రమాలను సాధించిన విజయాలను తెలియజేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పంచ పరివర్తన్, పర్యావరణ పరిరక్షణ సామాజిక సమరసత స్వదేశీ వస్తువులు వాడాలని పిలుపునిచ్చారు. గృహ సంపర్క పౌర నిర్మాణ నియమాలు బాధ్యతగల పౌరునిగా పాటిస్తూ దేశ సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
హిందువులను సంఘటితం చేసేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని దేశ రక్షణ ఆర్ఎస్ఎస్ తోనే (National Security is with RSS) సాధ్యమన్నారు. వందేళ్ళలో ఆర్ఎస్ఎస్ స్థాపించి దేశ రక్షణకు కృషిచేయడంతోపాటు విపత్కర పరిస్థితిల్లో అండగా ఉంటుందని గుర్తుచేశారు. ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు స్టిక్కర్ పుస్తకంతో కూడిన సాహిత్యాన్ని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. ఊట్కూర్ మండల కేంద్రంలో చేపట్టిన కార్యక్రమం పండగల కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులు ఏ రాములు, వెంకట్ నారాయణ, పృథ్వీరాజ్ , భన్నేష్, గోపాల్,బాలాంజనేయులు, భాను, రాజేష్, సాయికుమార్, అనీల్, చరణ్ తదితరులుపాల్గొన్నారు.
