TG | కెసిఆర్ కట్టిన కాళేశ్వరం కూలింది – ప్రభుత్వానికి అప్పు మిగిలింది : కోదండరామ్

హైదరాబాద్ – లక్షల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై (Kaleswaram Project ) జరుగుతున్న విచారణను ఎదుర్కోవడంలో ఎలాంటి తప్పులేదని తెలంగాణ జనసమితి (టి.జె.ఎస్) (Telangana Jana Samiti ) రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం (kodandaram) అన్నారు. ప్రజా సొమ్ము ఖర్చు చేసినప్పుడు, కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వడం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరు కావడంపై కొందరు రాద్ధాంతం చేయడం సమంజసం కాదని ఆయన విమర్శించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు..

“తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందే. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయి, రాష్ట్రానికి అప్పు మాత్రం మిగిలింది” అని వ్యాఖ్యానించారు. కమిషన్ (Commission ) ముందు హాజరై వాస్తవాలు వెల్లడించడం కేసీఆర్ (KCR) బాధ్యత అని ఆయన అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ప్రజా సమస్యలను వింటోందని, గత ప్రభుత్వ హయాంలో అలాంటి అవకాశం కూడా దొరకలేదని కోదండరాం అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad ) పరిధిలోని సమస్యల పరిష్కారానికి నగర కమిటీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జన సమితి కార్యకలాపాలను మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

Leave a Reply