Narsampeta | రిజర్వేషన్ల పై ఉత్కంఠ..

Narsampeta | రిజర్వేషన్ల పై ఉత్కంఠ..

  • రెండు దఫాలుగా జనరల్ బిసి
  • ఆశావహు నాయకుల్లో నెలకొన్నతీవ్ర ఉత్కంఠ

Narsampeta | నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల రిజర్వేషన్ల పై రాజకీయ నాయకులు, ఆశావాహుల్లో తీరని ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ రిజర్వేషన్ల సోషల్ మీడియాలో సైతం రిజర్వేషన్ల పై జోరుగా చర్చలు కొనసాగుతుంది. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉన్నాయి. ఎస్సి, ఎస్టీ, బీసీ, జనరల్ వర్గాలకు సంబంధించి ఇప్పటికే ఏ సామాజిక వర్గానికి ఎన్ని వార్డులు అని ఉన్నతాధి కారులు ప్రకటించారు. చైర్మన్ స్థానంతో పాటు ఏ వార్డ్ ఏ రిజర్వేషన్ అని మాత్రం ఇంకా ఫైనల్ చేయాల్సివుంది. కలెక్టర్ పరిధిలో వార్డు కౌన్సిలర్, రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. దీంతో రిజర్వేషన్ల పై రాజకీయ నాయకులతో పాటు ఆశావాహుల్లో అంతటా ఉత్కంఠ నెలకొంది. 2015లో గ్రామపంచాయతీ నుండి నగరపంచయతిగా అప్గ్రేడ్ కావడంతో మొదటి చైర్మన్ పాలెల్లి రామచంద్రయ్య చైర్మన్ గా ఎన్నికయ్యాయి. ఆయన మరణించడంతో నాగేల్లి వెంకటనారాయణ గౌడ్ చైర్మన్ గా ఎన్నికయ్యాయి.

2020 లో నర్సంపేట మున్సిపాలిటీ కి రెండో సారిగా ఎన్నికలో చైర్మన్ పదవి జనరల్ మహిళ కు కేటాయించడంతో, అధికారంలో ఉన్న బిఆర్ఎస్ అభ్యర్థి గుంటి రజనీ చైర్మన్ గా ఎన్నికైంది. ఈ దఫా బీసీ జనరల్ లేదా ఎస్సి సామాజిక వర్గాలకు చైర్మన్ పదవికి రిజర్వేషన్ రానున్నట్లు ఊహాగానాలు అంతటా వినిపిస్తున్నాయి. ఇప్పటికే నర్సంపేట మున్సిపాలిటీలో తుది ఓటర్, పోలింగ్ కేంద్రాల జాబితా ను అధికారులు విడుదల చేశారు. ఇక రిజర్వేషన్లు మాత్రమే ఖరారు కావాల్సి ఉంది. త్వరలో రిజర్వేషన్లు ఖరారు కావడంతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం ఓ పక్క సైరన్ మ్రోగించగా,మరో ప్రక్క ఎన్నికల కమిషన్ ఎప్పుడుబ్రిజర్వేషన్ లు ప్రకటిస్తారని రాజకీయ నాయకులు, ఆశావహులు ఆశగా ఎదురు కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి,బి ఆర్ ఎస్ నుండి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లు మున్సిపల్ స్థాయిలో ఆయా పార్టీలు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఆశావహులకు దిశానిర్దేశం చేశారు. నర్సంపేట మున్సిపాలిటీ లో ప్రధానంగా కాంగ్రెస్, బిఆర్ ఎస్ అభ్యర్థుల మధ్య మాత్రమే గట్టి పోటీ ఉంటుందని ప్రకటించగా బిజెపి,జనసేన, కమ్యూనిస్టు నాయకులు సైతం మేము కూడా మున్సిపాల్టీ ఎన్నికల బరిలో ఉన్నామని ప్రకటించారు. ఒక పార్టీలో కౌన్సిలర్ టిక్కెట్ రాకుంటే మరో పార్టీకి మారే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.రెబల్ గా బరిలోకి దిగాలని ఆలోచిస్తున్నట్లూ తెలిసింది. ఈ మున్సిపల్ ఎన్నికలు కాస్త పార్టీ గుర్తులతో నిర్వహించనుండడంతో దాదాపు గా కాంగ్రెస్, బి ఆర్ ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.నర్సంపేట మున్సిపాల్టీ 30 వార్డులలో గెలుపు మాదంటే మాది అంటున్నారు. మున్సిపాల్టీ కెంగ్రెస్ జెండా,గులాబీ జెండా ఎగురుతుందాని ప్రజలు తీవ్ర ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు.