Narendra Modi | హ్యాపీ పొంగల్..

Narendra Modi | హ్యాపీ పొంగల్..
- తెలుగు ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
Narendra Modi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ, ఏపీ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందించారు. “మన హృదయాల్లో ఆనందం, కృతజ్ఞతా భావాలను నింపే విశిష్టమైన పండుగ సంక్రాంతి. ఈ పండుగకు ప్రకృతితో ఉన్న అన్యోన్య అనుబంధాన్ని తెలియజేస్తుంది. రైతులు పండించిన పంటలు చేతికి వచ్చే ఈ శుభసమయం, ప్రకృతిని గౌరవించే మన సంప్రదాయానికి నిదర్శనం.

ఈ సంక్రాంతి పర్వదినం తెలుగు ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలి. ప్రతి ఒక్కరి కలలు సాకారం కావాలని, ప్రతి ఇంటా సంక్రాంతి కాంతి వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న” అని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రధాని తెలుగులో శుభాకాంక్షలు తెలపడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
