IND vs ENG | టీమిండియా ఘన విజయం.. 11 ఓవర్లకే చాప చుట్టేసిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్ లో సూర్య సేన విశ్వరూపం చూపింది. తొలుత బ్యాటింగ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో టీమిండియా.. స్కోరు బోర్డుపై 247 పరుగులు నమోదు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు భారత బౌలర్లకు షాక్ ఇచ్చారు.
వరుస వికెట్లు తీస్తూ… ఇంగ్లండ్‌ను కోలుకోలేని కష్టాల్లోకి నెట్టారు. కీలక బ్యాటర్లు అంతా సింగిల్ డిజిట్ పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (23 బంతుల్లో 55) హాఫ్ సెంచరీ సాధించగా… మిడిలార్డర్ లో జాకబ్ బెతెల్ (10) రెండంకెల స్కోరు చేశాడు.
ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ (3/25) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి (2/25), శివమ్ దూబే (2/11), అభిషేక్ శర్మ (2/3) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక రవి బిష్ణోయ్ (1/9) ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.