University | ఉస్మానియా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

University | ఉస్మానియా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
- సీఎంకు ఓయూ టీచింగ్, నాన్-టీ-చింగ్ ఎంప్లాయీస్ జేఏసీ లేఖ
- నేడు ఓయూకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి
University | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ(University) టీ-చింగ్, నాన్-టీ-చింగ్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ- (జేఏసీ) సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి ఉస్మానియా యూనవర్సిటీని సందర్శించనున్నారు.
ఈ సందర్భంగా జేఏసీ బహిరంగ లేఖ విడుదల చేసింది. రెండున్నర దశాబ్దాల కాలం నుండి ఉస్మానియాతోపాటు రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో(universities) పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైమ్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ-లోనే బడ్జె-టె-డ్ పోస్టులు 1240(1240 posts) ఉంటే అందులో కేవలం 340 మంది రెగ్యులర్ సిబ్బంది, 670 మంది కాంట్రాక్ట్, పార్‌టైమ్ లెక్చరర్లు పనిచేస్తున్నారని తెలిపింది.
నాన్ టీ-చింగ్, -టైం స్కేల్‌లో పని చేస్తున్నటు-వంటి ఉద్యోగులకు 60 శాతం ఈపీఎఫ్ చెల్లించాలని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీని అరికట్టాలని కోరింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఇష్టానుసారంగా పదోన్నతుల ప్రక్రియతో 50 మంది బలహీనవర్గాల(weaker sections) అధ్యాపకులను బలిపశువులను చేశారని ఆరోపించింది. మూడు వందల మంది తెలంగాణ సెక్యూరిటీ గార్డులను తొలగించి వారి స్థానంలో ఉద్యోగ విరమణ చేసిన సైనికులను రెట్టింపు వేతనాలతో నియమించారని, తక్షణమే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని పేర్కొంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(contributory pension scheme) అమలు చేయాలని, ఉద్యోగులు, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని జేఏసీ కోరింది.
ఇవే డిమాండ్లు…
- 01-09-2004కు ముందు నియామకమైన అధ్యాపకులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అమలు చేయాలి.
- 01-09-2004 తర్వాత నియమితులైన ఉద్యోగులకు సీపీఎస్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి.
- యూజీసీ నిబంధనలు, జీఓ నెం.15 ఉల్లంఘనలతో సీఏఎస్ ప్రమోషన్లు తిరస్కరించబడిన 47 మంది అధ్యాపకులకు జరిగిన అన్యాయం సరిదిద్దాలి. ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
- దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరణ చేయాలి
- పార్ట్–టైమ్ అధ్యాపకులను అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ పోస్టులకు అప్‌గ్రేడ్ చేయాలి.
- జీవో 21 ప్రకారం పార్ట్-టైమ్ అధ్యాపకుల సేవలకు వెయిటేజ్ ఇవ్వాలి.
- ఉస్మానియా యూనివర్సిటీ-లో 10-20 సంవత్సరాలుగా పనిచేస్తున్న నాన్-టీ-చింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. వీరిని లాంగ్ టర్మ్ సెర్వీస్ కింద క్రమబద్ధీకరించాలి. క్రమబద్ధీకరణ జరిగే వరకు సమాన పనికి సమాన వేతనం, గ్రాడ్యూటీ-, ఈఎస్‌ఐ, పీఎఫ్ అమలు చేయాలి.
- -టైమ్-స్కేల్, కాంట్రాక్ట్ నాన్-టీ-చింగ్ సిబ్బందికి 60 శాతం ఈపీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలి.
- అవుట్‌సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెగ్యులర్ ఉద్యోగుల సరసన సరైన వేతనాలు, ప్రయోజనాలు అమలు చేయాలి.
- ఉద్యోగులకు అవసరమైన సాధారణ సంక్షేమ చర్యలు
