వాటి విలువ రూ.50 లక్షలు
జహీరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద గోవా నుంచి ఓ ప్రైవేటు బస్సులో తెలంగాణ వైపు తెస్తున్న 46 కిలోల మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మత్తు పదార్థాలు సుమారు రూ.50 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. పక్కా సమాచారంతో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాలను తనిఖీ చేపట్టారు.
పట్టుబడింది ఇలా…
గోవా నుంచి హైదరాబాద్‌కు ఓ ట్రావెల్ బస్సు వస్తోంది. ఈ రోజు తెల్లవారు జామున అప్పటికే జహీరాబాద్ మండలం మాడిగి శివారులో అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద మాటు వేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. గోవా నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సులో 46 కిలోల మత్తు పదార్థలు పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. వాటి విలువ రూ. 50 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మత్తు పదార్థాలను తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. మత్తు పదార్థాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

