Nalgonda | రైతులతో ముఖాముఖి…
Nalgonda | మునుగోడు, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నాణ్యతా ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని నల్లగొండ(Nalgonda) జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(Tripathi) ధాన్యం కొనుగోలు కేంద్రం అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఆమె నల్లగొండ జిల్లా మునుగోడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 17 శాతం తేమతో తాలు, తరుగు లేకుండా నాణ్యత ప్రమాణాలతో వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. వర్షాలు కూడా లేనందున తేమ శాతంను పరిశీలించి రైతులకు మేలు జరిగే విధంగా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. పి పి సెంటర్లో రైతులతో ముఖాముఖి(face to face) మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేవని రైతులు ఆమెకు తెలిపారు.
ఆమె వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్(J Srinivas), జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపికృష్ణ, జిల్లా అధికారి వెంకటేష్, సహకార అధికారి పత్యా నాయక్, చండూరు ఆర్డీవో వందనపు శ్రీదేవి, తహసిల్దార్ నేలపట్ల నరేష్, వ్యవసాయ సహాయ సంచాలకులు వేణుగోపాల్, ఏ ఈ ఓ మౌనిక, పాలకూరి సుఖేందర్, దుబ్బ పురుషోత్తం తదితరులు ఉన్నారు.

