Gardens | తమ కలలను నిజం చేసుకోవాలి…
Gardens | తమ కలలను నిజం చేసుకోవాలి…
- విద్యతో పాటు కళల్లోనూ రాణించాలి..
- యువతీ యువకుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు..
- నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్..
Nagar Kurnool | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : విద్యార్థులు, యువతీ యువకులు చదువుతో పాటు వివిధ రకాల కళల్లోనూ రాణించాలని ప్రతి విద్యార్థి విద్యతోపాటు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో తమ కలలతో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి అని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(Badawat Santosh) పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని సాయి గార్డెన్స్(Sai Gardens)లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలను కలెక్టర్ జ్యోతి ప్రజ్వలనం(Collector Jyoti Prajwalanam) చేసి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, కలల్లోనూ రాణించి జిల్లా, రాష్ట్రం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిలోనూ ఏదో ఒక రంగంలో ప్రతిభ దాగి ఉంటుందని, దాన్ని వెలికితీసి అభివృద్ధి చేస్తే భవిష్యత్తు మరింత బంగారుమయం అవుతుందన్నారు. చదువుతో పాటు క్రీడలు, కలలు, నైపుణ్యాలు(Dreams, Skills) సమానంగా అభివృద్ధి కావాలని సూచించారు. గత సంవత్సరం జాతీయ స్థాయి పోటీల్లో మెప్పించిన కళాకారులను అభినందించారు. ఈసారి రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. విద్యార్థులు తమ కలలను నిజం చేసుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. నర్సింగ్ కళాశాల(Nursing College), పలు పాఠశాలలు నిర్వహించిన సైన్స్ ప్రదర్శనలను సందర్శించి విద్యార్థుల ఆవిష్కరణలను పరిశీలించారు. హీమోడయాలసిస్(Hemodialysis) విధానంపై విద్యార్థిని షాహిన్ ఇచ్చిన ప్రజెంటేషన్ ఆయనను ఆకట్టుకుంది. పల్లెటూరి పల్లకిలో గేయానికి విద్యార్థులు చేసిన నృత్యాలను తిలకించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి సీతారాం నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్, జిల్లా డిఎంహెచ్వోఓ డాక్టర్ రవి నాయక్(DMHOO Dr. Ravi Naik), జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ రావు, నాగర్ కర్నూల్ తహసిల్దార్ తబితా రాణి, వివిధ పాఠశాలలు కళాశాలల చెందిన విద్యార్థిని విద్యార్థులు, యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.


