nabha natesh| రీ-ఎంట్రీలో వ‌రుస సినిమాల‌తో బిజీబిజీ

nabha natesh| రీ-ఎంట్రీలో వ‌రుస సినిమాల‌తో బిజీబిజీ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇస్మార్ట్ శంక‌ర్‌ సినిమాతో టాలీవుడ్‌లో హ‌ల్‌చ‌ల్ చేసిన‌ బ్యూటీ నభా నటేష్ చిన్న విరామం త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. గతంలో జరిగిన ఒక ప్రమాదం కారణంగా నభా నటేష్ కొంతకాలం వెండితెరకు దూరమయ్యారు. గతేడాది ప్రియదర్శి సరసన ‘డార్లింగ్’ (2024) సినిమాతో అద్భుతమైన రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్ర‌స్తుతం నభా నటేష్ చేతిలో వరుసగా భారీ సినిమాలు ఉన్నాయి. నిఖిల్ సిద్ధార్థ్ సరసన పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభూ లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న టైసన్ నాయుడు లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీటితో పాటు పాన్-ఇండియన్ అడ్వెంచర్ మూవీ నాగబంధం లో ‘పార్వతి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో ఆమె కనిపించబోతున్నారు. 2026 వేసవిలో విడుదల కానున్న ఈ సినిమాలతో నభా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు.

Leave a Reply