అదృశ్యమైన వ్యక్తి మిస్టరీ వీడేది ఎన్నడో..

అదృశ్యమైన వ్యక్తి మిస్టరీ వీడేది ఎన్నడో..
- పోలీసుల విస్తృత గాలింపు..
- 8 రోజులైనా లభించని ఆచూకీ..
జన్నారం, ఆంధ్రప్రభ : తిమ్మాపూర్ లో అదృశ్యమైన నాగసముద్రం వ్యక్తి మిస్టరీ వీడేది ఎన్నడో. అదృశ్యమైన వ్యక్తి మల్లేష్ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు నిర్వహిస్తున్నారు. ఆ వ్యక్తి అదృశ్యమై 8 రోజులైనా ఇంకా లభించని ఆచూకీ.మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తిమ్మాపూర్ రామాలయం సమీపంలో ఈ నెల 17న రాత్రి అదృశ్యమైన దండేపల్లి మండలంలోని నాగసముద్రం చెందిన గూడ మల్లేష్(50) ఆచూకీ కోసం మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ సూచన మేరకు లక్షేటిపేట సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో జన్నారం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్,లక్షేటపేట,దండేపల్లి ఎస్సైలు గోపతి సురేష్,తహసీనోద్దీన్ శుక్రవారం ఆ ప్రాంతంలో పంటలు వేసిన రైతులను,యువకులను విచారించారు.

అదృశ్యమైన మల్లేష్ తో ఘటన రోజు ఉన్న మిగతా వ్యక్తులను అదుపులోకి తీసుకొని సీరియస్ గా తమదైన ధోరణిలో సీఐ,ఎస్ఐలు విచారిస్తున్నట్లు సమాచారం.ఆ తర్వాత ఆ వ్యక్తి ఆచూకీ కోసం 100 మంది రైతులు,యువకులతో కలిసి ఆ సీఐ,ఎస్సైలు పరిసర గోదావరినది,బావులు, వాగుల్లో వెతికారు.ఐదు రోజుల క్రితం డాగ్స్ స్క్యాడ్ బృందం,డోన్ కెమెరా తోను ఆ పరిసర ప్రాంతాలలో వెతికారు.అయినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు.ఆ వ్యక్తి ఆచూకీ కోసం ఇంకా భార్య,పిల్లలు,బంధుమిత్రులు ఎదురుచూస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఆ వ్యక్తి టార్చ్ లైట్ వెలుతురుకు పోలీసులు వచ్చారనే భయంతో చీకట్లో పరారవుతూ,ఆ ప్రాంతంలో పంటల రక్షణ కోసం రైతులు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి షాప్ తో అక్కడే చనిపోగా గుర్తించిన కొంతమంది రైతులు భయంతో ఆ వ్యక్తిని అక్కడి నుంచి గోదావరి ప్రాంతానికి తరలించి ఇసుకలో గోతితవ్వి పాతి పెట్టారా? ఆ వ్యక్తికి బండగట్టి గోదారివరినది నీటిలోనూ,ఏదైనా పెద్ద బావిలో పడేశారేమోననే అనుమానం కొంతమంది గ్రామస్తులు వ్యక్తం చేశారు.

ఆ వ్యక్తి భయానికి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లి తలదాచుకున్నాడేమోననే అనుమానాలు మరి కొంత మంది వ్యక్తం చేశారు.ఆ మల్లేష్ వాడిన చెప్పులు గోదావరినది నీటి ప్రవాహం వద్ద పోలీసులకు లభించాయి. ఆ వ్యక్తి ఫోను ఇప్పటికీ స్విచ్ ఆఫ్ లోనే ఉంది.ఇప్పటికీ తనకు తాను అనుకోకుండా చనిపోయినట్లయితే శవం లభించేదని ఇంకొందరు గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అదృశ్యమైన ఆ వ్యక్తి మిస్టరీ ఎన్నటికీ వీడనుందో వేచి చూడాల్సిందే.
