murder | దారుణ హత్య..

మృతుడి ఒంటి పై 11 కత్తి పోట్లు
అక్రమ సంబంధమే కారణం
ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ


murder | నర్సాపూర్, ఆంధ్రప్రభ : యువకుడు దారుణహత్యకు గురైన ఘటన మెదక్ జిల్లా (Medak district) నర్సాపూర్ లో మంగళవారం చోటుచేసుకుంది. నర్సాపూర్ (Narsapur) రాయరావు చెరువు సమీపంలోని చెట్ల పొదల్లో ఫారూక్ (25) అనే వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య (Brutal murder) చేశారు. మృతుడి ఒంటి పై 11 కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

murder | అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు..

సంఘటన స్థలాన్ని డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ రెడ్డి పరిశీలించారు. ఉత్తరప్రదేశ్ చెందిన ఫారూక్ (Farooq) నర్సాపూర్ కు చెందిన యువతిని ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఇటీవల ఆప్ష అనే వివాహితతో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అప్ష భర్త షబ్బీర్ (Shabbir) మరో వ్యక్తితో కలిసి హత్యకు కుట్ర పన్నినట్టు మృతుడి కుటుంబీకుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.