జనహృదయ దళపతి విజయ్‌కు అభినందనలు ..

జనహృదయ దళపతి విజయ్‌కు అభినందనలు ..

పాయకాపురం, ఆంధ్రప్రభ : కుల, మత, వర్గ తారతమ్యాలు మరచి ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా తమిళనాట ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సినీ నటుడు విజయ్ అభినందనీయుడు అని జిఆర్కె పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షుడు గోళ్ళ నారాయణరావు అన్నారు. నగరంలోని పలు సాంస్కృతిక సంస్థల అధినేతలు గాంధీనగర్ లోని ఒక హోటల్ లో సమావేశమై తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్ ను అభినందించారు.

బడుగు, బలహీన వర్గాల తమిళ ప్రజలు తమ జీవితాలకు వెలుగుచూపే దివ్వెగా విజయ్ను ఆరాధిస్తున్నారని నారాయణ రావు అన్నారు. సినీ నటుడిగా ఎదిగిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగటం కళాకారులకు గర్వకారణం అని ఆదిలీలా ఫౌండేషన్ అధ్యక్షులు ఎస్ ఆదినారాయణ కొనియాడారు. తెలుగు కళా వాహిని అధ్యక్షులు చింతకాయల చిట్టిబాబు కళాకారులకు ఆదర్శప్రాయుడు విజయ్ అన్నాడు. ఈకార్యక్రమంలో ఎక్స్ రే కార్యదర్శి బోడి ఆంజనేయ రాజు, బిఆర్ అంబేద్కర్ సాంస్కృతిక సమితి భాధ్యులు కె డేవిడ్ రాజు, బివి వీరభద్రరావు, శ్రీకళాభారతి అధ్యక్షులు సింగంశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సింగ్ నగర్ ప్రాంతంలో ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ మంగలపూడి జోసెఫ్, ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందినలు తెలిపారు. ఎస్.సి.సెల్ నాయకులు గురివిందపల్లి డేవిడ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply