బాసర ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ..

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి కొలువైన బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆదివారం భూమిపూజ నిర్వహించారు.

నూతన ఆలయ నిర్మాణ దాతలు సురపనేని సునంద్–పద్మప్రియ దంపతులు, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఆలయ ఈవో అంజనీదేవి, శృంగేరికి చెందిన పండితులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆలయ ఉత్తర గోపురానికి ఎదురుగా ఉన్న తోరణం వద్ద శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.