ఘనంగా ఎమ్మెల్యే కొలికపూడి జన్మదిన వేడుక..

గంపలగూడెం, ఆంధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను అభిమానులు, నాయకులు సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు.

ముందుగా తోటమూల రింగ్‌ సెంటర్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. తోటమూల రింగ్‌ సెంటర్‌ నుంచి సాయిబాబా ఆలయం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం సాయిబాబా ఆలయంతో పాటు మేడూరులోని స్వయంభూ శ్రీ వీరాంజనేయస్వామి ఆలయం, నెమలిలోని వేణుగోపాలస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెమలి, మేడూరు తదితర గ్రామాల్లోనూ ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్‌ కటింగ్‌ కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధికి వివిధ విధాలుగా కృషి చేస్తున్నారని తెలిపారు. నిరుద్యోగ యువత కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయడంతో పలువురికి ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆయన ఎల్లప్పుడూ అండగా ఉంటున్నారని అన్నారు.

ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమాల్లో మల్లవరపు చైతన్య, రామిశెట్టి శ్రీరామ్‌, కాటిని నరేష్‌, గుండ్రెడ్డి వెంకటలక్ష్మి, బుసా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.