ఎల్ఈడీ బల్బుల విరాళం
జైనూర్ ఆంధ్రప్రభ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం ఆశపెల్లి సోంజిగూడ గ్రామానికి రూ.38 వేల విలువైన మూడు ఎల్ఈడీ బల్బులను విరాళంగా అందించారు. యంగ్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆడ వెంకటేష్ ఆధ్వర్యంలో సోమవారం బల్బులను ఆశపెల్లి సర్పంచ్ మర్ప రవీందర్‌కు అందజేశారు.
గ్రామంలో మెరుగైన వెలుతురు సౌకర్యం కల్పించడం ద్వారా ప్రజల భద్రతతో పాటు గ్రామ అభివృద్ధికి కూడా తోడ్పడుతుందని కోఆర్డినేటర్ ఆడ వెంకటేష్ తెలిపారు. పంచాయతీకి ఎల్ఈడీ బల్బులను విరాళంగా అందించిన ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ, యంగ్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులకు సర్పంచ్ రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు.
