పెద్ది కుటుంబానికి సంఘీభావం
యశోద ఆసుపత్రిలో ఆరోగ్య పరిస్థితిపై ఆరా
కరీమాబాద్, ఆంధ్రప్రభ: గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఆయన సతీమణి మెహర్ వాణి దంపతులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో మంగళవారం పరామర్శించారు.
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి పెద్ది స్వప్నతో పాటు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. సుదర్శన్ రెడ్డి త్వరగా పూర్తిస్థాయి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రి రేడ్యా నాయక్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు తమ సంఘీభావాన్ని తెలిపారు.
