ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికం..

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికం..

ప్రత్యేక దర్శనాలపై తాత్కాలిక ఆంక్షలు
అంతరాలయ, విఐపీ దర్శనాలు నిలిపివేత..
సామాన్య భక్తులకు ప్రాధాన్యం

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : వారాంతం వరుస సెలవుల నేపథ్యంలో విజయవాడ లోని ఇంద్రకీలాద్రి పై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం వద్ద భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 వరకు రూ 500 అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇదే సమయంలో విఐపీ, ప్రోటోకాల్ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేశారు.

క్యూ లైన్లలో వేచి ఉన్న సామాన్య భక్తులు త్వరగా అమ్మవారిని దర్శించుకునేలా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భక్తులందరికీ బంగారు వాకిలి ద్వారానే అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పరిస్థితులను సమీక్షించి తిరిగి దర్శన టికెట్ల జారీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. భక్తులు ఆలయ సిబ్బందికి సహకరించి క్రమశిక్షణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply