రైతుల సంక్షేమమే ప్రభుత్వ ద్వేయం..

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ద్వేయం..
- వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే
చిట్యాల, ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమమే, ధ్యేయంగా, రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండలంలోనిదూత్పల్లి,ఒడితల,గోపాలపురం ,చల్లగరిగే (మొక్కజొన్న)- నవాబుపేట, జడలపేట, (మొక్కజొన్న) ,నైన్ పాక , అందుకుతండ గ్రామాలలో పి.ఎ.సి.ఎస్, ఐ.కె.పి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్ఏర్పాటుచేసిన, వరి, మొక్కజొన్న, కేంద్రాలను ఆయన ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ప్రజా పాలన ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులు తమ పండించిన వరి, మొక్కజొన్న పంట లు, కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన కోరారు. గ్రామాల్లో దళారుల మాట నమ్మి తక్కువ ధరకు వరి ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని కోరారు. సకాలంలో మండలంలో ఏర్పాటు చేసిన ఆయా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రం ఇన్చార్జీలు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, తాసిల్దార్ వసంత రావు, పిఎసిఎస్ సీఈవో మెరుగు మొగిలి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధు వంశీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి, సర్పంచులు, బండి భగవాన్, తరాల ప్రమీల, సిరి పెళ్లి జంపయ్య, నక్క భాస్కర్ , కర్రు లక్ష్మీ , కాసం మాధవి, మటికే సుజాత, పర్లపెల్లి రవి, కొడారి అశోక్ , నిర్వాహకులు పింగిలి జ్యోతి రెడ్డి, నాయకులు కసిరెడ్డి సాయి సుధా- రత్నాకర్ రెడ్డి, సర్వ శరత్, కట్కూరి నరేందర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
