పదవులకే వన్నె తెచ్చే నాయకుడు ఎమ్మెల్యే బొండా ఉమా…

పదవులకే వన్నె తెచ్చే నాయకుడు ఎమ్మెల్యే బొండా ఉమా…
పాయకాపురం, ఆంధ్రప్రభ : పార్టీ అధిష్టానం ఇచ్చే ఏపదవినైన తీసుకొని, అందుకు తగ్గ పనిచేసి మెప్పించడమే సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొప్పతనమని స్థానిక64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ అన్నారు. సింగ్ నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావుని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించిన సందర్భంగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కె. రవికుమార్, కుందా వారి కండ్రిక బ్యాంక్ చైర్మన్ సాదం శ్రీనాద్లు శనివారం ఎమ్మెల్యే బొండా ఉమాను మర్యాద పూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛం, శాలువతో ఘనంగా సత్కరించారు. సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ ఇంఛార్జిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన బొండా ఉమామహేశ్వరరావు, 2014లో ఎమ్మెల్యేగా, 2024లో మరొక సారి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తున్నారని అన్నారు.
సీఎం చంద్రబాబు ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి సత్కరించారని అన్నారు. ప్రతిపక్షంలో సైతం ప్రజల మధ్యలో ఉండి, అనేక కార్యక్రమాలు నిర్వహించారని వారన్నారు. కోమరి రాజేష్, కంకణాల బాబు, అప్పలనాయుడు తదితరులు ఎమ్మెల్యే ను సన్మానించిన వారిలో ఉన్నారు.
అందరూ మొక్కలు నాటాలి…
ప్రతి ఒక్కరూ మొక్కలు విరివిగా నాటాలని స్థానిక64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె.రవికుమార్ అన్నారు. డివిజన్ ప్రాంతంలో బివి సుబ్బారెడ్డి హై స్కూల్ ఆవరణలో స్వచ్చంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రవికుమార్, ఏ.ఎస్.ఓతో కలసి మొక్కలు నాటారు. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు దుర్గా ప్రసాద్, టీడీపీ నాయకులు ఎస్. కె బాబు,కోమరి రాజేష్, కంకణాల బాబు తదితరులు పాల్గొన్నారు.
