ప్రమాదాల నివారణే లక్ష్యం…

ప్రమాదాల నివారణే లక్ష్యం…

సెంట్రల్లో పలు చోట్ల బ్లాక్ స్పాట్స్ గుర్తింపు..
అప్రమత్తత, నిరంతర పర్యవేక్షణ..
ట్రాఫిక్ ఏసీపీ శ్రీ వేద..

పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రమాదాల నివారణే లక్ష్యమని, సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పలు చోట్ల బ్లాక్ స్పాట్స్ గుర్తించామని అప్రమత్తత, నిరంతర పర్యవేక్షణే ధ్యేయమని ట్రాఫిక్ ఏసిపి శ్రీ వేద అన్నారు. నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలలో భాగంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీవేదతో కలసి అజిత్ సింగ్ నగర్ ట్రాఫిక్ సిఐ ప్రభాకర్ ప్రమాదకరంగా మారిన కూడళ్లను గుర్తించి, అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారురు.

విజయవాడలోని అయోధ్య నగర్ ప్రాంతంలో ప్రమాదకరంగా ఉన్న కూడలిని ట్రాఫిక్ ఏసిపి శ్రీ వేద సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన బ్లాక్ స్పాట్ హెచ్చరిక బోర్డులను ఆమె పర్యవేక్షణ చేశారు. ఈ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా ఉన్నందున, వాహన చోదకులు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వేగాన్ని తగ్గించి ప్రయాణించాలని ఏసిపి సూచించారు. ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించి, అక్కడ మరిన్ని భద్రతా చర్యలు తీసుకోనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి ప్రాణం విలువైనది.

రహదారి నిబంధనలు పాటించడం ద్వారానే ప్రమాదాలను అరికట్టడం సాధ్యమవుతుంది. మలుపులు, కూడళ్ల వద్ద వేగ నియంత్రణ తప్పనిసరి అని ట్రాఫిక్ ఏసిపి శ్రీ వేద పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ ప్రభాకర్, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply