అత్తాపూర్ లో రెచ్చిపోయిన పోకిరీలు..

అత్తాపూర్ లో రెచ్చిపోయిన పోకిరీలు..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పోలీసుల‌ ముందే ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. బైక్ ముందు వీల్ పైకి లేపి రయ్ రయ్ అంటూ పోలీసుల ముందు నుండే దూసుకు వెళ్లింది పోకిరి గ్యాంగ్. స్టంట్స్ ను మొబైల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియా లో పోస్టింగ్ చేశారు. పోలీసుల ముందే మా స్టంట్స్.. అంటూ థంబ్ నేల్ పెట్టారు.

దీంతో రంగంలోకి దిగిన స్టంట్స్ కు పాల్పడ్డ పోకిరీల ఆట కట్టించారు అత్తాపూర్ పోలీసులు. రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్ నేతృత్వంలో పోకిరీలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. స్టంట్స్ చేస్తే.. తాట తీస్తామంటూ హెచ్చరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అత్తాపూర్ ప్రాంతంలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేసి, రాత్రి సమయంలో పెట్రోలింగ్‌ను పెంచినట్లు అధికారులు వెల్లడించారు. స్థానికులు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.