Minister | అభివృద్ధి ప‌నుల ప‌రిశీల‌న‌…

Minister | అభివృద్ధి ప‌నుల ప‌రిశీల‌న‌…

Medaram | ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seetakka) పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ రోజు తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ(Medaram Sammakka Saralamma) తల్లులను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్‌(Collector Diwakar TS)తో కలిసి మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం ఆలయ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వారితో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్(Ravi Chander), మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు, ఈ ఓ వీరస్వామి, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్, ఇర్రిగేషన్ శాఖల అధికారులు ఉన్నారు.