ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు జరుగుతున్న తొలి సెమీస్ లో.. ఆసీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. టీమిండియా ముందు ఆసీస్ 265 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఈ భారీ ఛేదనలో ఆరో వికెట్ గా హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ 28) ఔటయ్యాడు. 17.5వ ఓవర్లో ఎల్లిస్ వేసిన బంతికి ఆరో వికెట్ గా వెనుదిరిగాడు.
ప్రస్తుతం ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (36)- జడేజా ఉన్నారు. భారత్ విజయానికి 12 బంతుల్లో 5 పరుగులు చేయాల్సి ఉంది.