Minister | రోడ్డు సైడ్ టీ తాగిన మంత్రి అడ్లూరి…

Minister | రోడ్డు సైడ్ టీ తాగిన మంత్రి అడ్లూరి…
- లచ్చన్న ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగిన మంత్రి…
- లచ్చన్న ను ఆసుపత్రిలో చెక్ చేపించమని మాజీ సర్పంచ్ తెలిపిన మంత్రి…
Minister | వెల్గటూర్, ఆంధ్రప్రభ : నిత్యం బిజీ బిజీగా ఉండే రాజకీయ నేతలు, మంత్రులు రోడ్డుపై వెళ్తున్నప్పుడు చిరు వ్యాపారుల దగ్గర ఆగి వారి కష్ట సుఖాలు తెలుసుకుంటూ…కొద్దిసేపు వారితో సమయం కేటాయిస్తారు. రాజకీయ ఒత్తిళ్లు సవాలక్ష సమస్యలతో సతమతమయ్యే నేతలు అప్పుడప్పుడు రోడ్డుపక్కనే బిజినెస్(Business) చేసే చిరు వ్యాపారులను కలిసి, వారు తయారు చేసిన పదార్థాలను తిని సంతోష పడుతుంటారు.
ఇలా చేయడం వల్ల కాస్త వారికి రిలీఫ్ దొరికినట్టు అవుతుంది. చిరు వ్యాపారులను ప్రోత్సహించినట్టు అవుతుందని భావిస్తారు. ఇదే తరహాలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) ఇవాళ సందడి చేశారు. మండల కేంద్రంలో ని మంత్రి అభిమాని లచ్చన్న టీ స్టాల్ ల్లో టి తాగారు. హోటల్ యజమాని లచ్చన్న ను ఆరోగ్యం ఎలా ఉందని ఆప్యాయంగా అడిగారు. అలాగే పక్కనే ఉన్న మాజీ సర్పంచ్ మెరుగు మురళీ లచ్చన్నను మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రిలో చూపించమని కోరారు.

అనంతరం కొద్దిసేపు అక్కడ వెయిట్ చేసి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కాసేపు ముచ్చటించారు. అలాగే గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణం(temple construction) పనులు ఎలా జరుగుతున్నాయని ఆలయానికి సంబంధించిన వారితో ఆరా తీశారు. మాజీ ఎంపీటీసీ లకుమల్ల దేవయ్య ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. ఉదయం మంత్రి టి స్టాల్లో కనిపించడంతో అటు వైపు వెళ్లే ప్రజలు వారిని చూసేందుకు ఎగబడ్డారు. అక్కడికి చేరుకున్న ప్రజలు, కార్యకర్తలకు అభివాదం తెలియజేస్తూ చిరునవ్వుతో పలకరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గండ్ర ప్రతాప్ రావు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు బందెల ఉదయ్ గౌడ్(Bandela Uday Goud), జిల్లా యువజన సంఘం జెనరల్ సెక్రటరీ గండ్ర శ్రీకాంత్ రావు, మాజీ ఉప సర్పంచ్ గుండాటి సందీప్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నరేష్ గౌడ్, గుమ్ముల అజయ్, లొత్తునూర్ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్, గొల్లపల్లి మండల పార్టీ అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, ఎనగందుల నరేష్, రేగుంట నర్సయ్య, గొల్లపల్లి, వెల్గటూర్, మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
