మంచి చేసే ప్రభుత్వాన్ని ఎంచుకున్న వారికి రుణపడి ఉంటాం
మంచి చేసే ప్రభుత్వాన్ని ఎంచుకున్న వారికి రుణపడి ఉంటాం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై మంత్రి వ్యాఖ్యలు
తిరుమల, (ఆంధ్రప్రభ): మంచి చేసే ప్రభుత్వాన్ని ఎంచుకున్న ప్రజలకు రుణపడి ఉంటామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మరింత ప్రజలకు మేలు చేసేలా స్వామివారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
