కొండాపూర్‌లో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ…
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కొండాపూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) దశరథ్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తొగర్‌పల్లి ఉన్నత పాఠశాల, అనంతసాగర్ ఉన్నత పాఠశాల, మారేపల్లి ఉన్నత పాఠశాల, గుంతపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, తొగర్‌పల్లి ప్రాథమిక పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.
ఇంకా పాఠ్యపుస్తకాలు తీసుకెళ్లని యూపీఎస్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు పుస్తకాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలని ఎంఈవో దశరథ్ సూచించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మారేపల్లి ప్రధానోపాధ్యాయులు సంజీవ్‌రావు, అనంతసాగర్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్యయాదవ్, గుంతపల్లి యూపీఎస్ ప్రధానోపాధ్యాయులు వటపత్ర సాయి, ఉపాధ్యాయులు రఘునాథ్, రాఘవేందర్ రెడ్డి, ఎంఐఎస్ అనంతయ్య, సీఎర్పీలు పాల్గొన్నారు.
