ఉపాధి హామీ పనుల వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట మండలం కొత్తూరు మోట్లగూడెం గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనుల వద్ద మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం కూలీలు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామ యువత, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply