ప్రతిభకు ఘన సన్మానం.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం!

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జడ్పీహెచ్‌ఎస్ కమ్మర్‌పల్లి పాఠశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలలో గతంలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా సేవలందించి పదవీ విరమణ పొందిన రాజేశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన స్వయంగా సన్మానించారు.
అలాగే బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశం సాధించిన జాగర్ల శ్రీజ, యేనుగందుల సౌమిత్ అనే ఇద్దరు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
విద్యార్థుల కృషి, పట్టుదల, విజయాలను కొనియాడిన రాజేశ్వర్ గౌడ్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల విజయాలను అభినందిస్తూ, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. రాజేశ్వర్ గౌడ్ అందించిన ప్రోత్సాహం విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమం విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి, లక్ష్యసాధన పట్ల నిబద్ధతను పెంపొందించేలా స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
