ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా…

ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా…

విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

గట్టుప్పల, ఆంధ్రప్రభ : ప్రపంచ భూమి దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మునుగోడు రేంజ్ నల్గొండ డివిజన్ అధికారులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి సుచరిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భూమి మన జీవనాధారం అని,ప్రకృతి వనరులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

అడవుల పరిరక్షణ, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి అంశాలపై విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లు నాటాలని, చెట్లను నాటితేనే ప్రకృతి మనని కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ అధికారి చందన,ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు యాదయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎండి షఫీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply