గ్రామపంచాయతీ భవనం అన్ని వసతులతో నిర్మిస్తాం.

గ్రామపంచాయతీ భవనం అన్ని వసతులతో నిర్మిస్తాం.

ఊట్కూర్, ఆంధ్రప్రభ : పాలనా సౌలభ్యం కోసం గ్రామపంచాయతీ భవనం అన్ని వసతులతో ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా నిర్మిస్తామని మొగ్ధంపూర్ సర్పంచ్ తిరుమలేష్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్ధంపూర్ గ్రామపంచాయతీ భవనం ఉపాధి హామీ పథకం నిధులు రూ.20 లక్షలతో భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సొంత భవనం లేక పాలకవర్గం సభ్యులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రూ 20 లక్షల నిధులు మంజూరు చేయడంతో పనులు వేగవంతంగా చేపడుతామనిఅన్నారు.

ఎన్నో ఏళ్లుగా గ్రామపంచాయతీ భవనానికి సొంత భవనం లేక ఇబ్బంది పడుతుండగా సొంత భవనం తన హయాంలో చేపట్టడం ఆనందంగాఉందనిఅన్నారు. అధికారుల సహకారంతో జిపి భవనం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గ్రామ సర్వతోముఖాభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేందర్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply