Meeting | జీవన్ రెడ్డి ప్రకటనపై చర్చలు
Meeting | జీవన్ రెడ్డి ప్రకటనపై చర్చలు
Meeting | జగిత్యాల, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి జీవన్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈనెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు జీవన్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవాళ జగిత్యాల పట్టణంలో మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నివాసంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, విప్ అది శ్రీనివాస్ లు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో జరిగిన చర్చలు సఫలీకృతమయ్యాయా లేదా జీవన్ రెడ్డి నిర్ణయంలో మార్పు ఏమైనా ఉందా అనేది కాసేపట్లో తెలియనుంది.
