బీఆర్ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టు..

బీఆర్ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టు..

నిజాంపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి నేటి వరకు నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్వి నాయకుల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో నిజాంపేట పోలీసులు బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్, యూత్ అధ్యక్షులు మౌవూరంరాజులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టీలో నిరుద్యోగులకు ఉద్యోగులు కల్పిస్తామని చెప్పి నేటి వరకు నెరవేర్చకపోవడం సిగ్గుమాలిన చర్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, 6 గ్యారంటీల పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ ఖజానాను దోచుకుంటున్నారన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలలో ఇది 4వ బడ్జెట్ సమావేశమని ఇన్ని బడ్జెట్ సమావేశాలు జరిగినా విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించి ఊసే ఎత్తకపోవడం దారుణం అన్నారు.

సిద్దిపేట సభలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యే గెలిపిస్తే మంత్రి పదవి కేటాయిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఉన్నటువంటి మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి అభివృద్ధి చేసుకోవచ్చు కదా! అని ప్రశ్నించారు. సిద్దిపేటలో నీ ఆటలు చెల్లవని హరీష్ రావు పై ఎన్ని ఎత్తుగడలు వేసినా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేదని.. రానున్నది స్వర్ణయుగమే కేసిఆర్ ప్రభుత్వమే అని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అక్రమ అరెస్టులకు పాల్పడకుండా అభివృద్ధి పై దృష్టి సారించాలన్నారు.