Meeting | సీఎం విజయ్‌కు డైరెక్టర్ షాకింగ్ గిఫ్ట్!

Meeting | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ.. ఇటీవలే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అగ్ర కథానాయకుడు ‘దళపతి’ విజయ్‌ను ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్) చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అయితే ఈ భేటీ కేవలం ఒక నార్మల్ మీటింగ్‌లా కాకుండా, నెట్టింట సంచలనంగా మారింది. దీనికి కారణం వెంకట్ ప్రభు సీఎం విజయ్‌కు అందించిన ఒక వినూత్నమైన కానుక.

ఎవరైనా సీఎంకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే.. దేవుడి విగ్రహాం లేదా ఏదైనా ఖరీదైనా వస్తువులో ఇస్తారు. కానీ దర్శకుడు వెంకట్ ప్రభు సీఎం విజయ్ కు ఓ అరుదైన గిఫ్ట్ ను ఫ్రేమ్ గా చేసి చేశారు. అదేంటా అని అనుకుంటున్నారు. నెంబర్ ప్లేట్ అండి. నెంబర్ ప్లేటా అనుకోకండి. ఆ నంబర్ ప్లేట్ కి చాలానే కథ ఉందండి బాబూ.. విజయ్ పార్టీని స్థాపించిన కొన్ని రోజులకు గోట్ సినిమా రిలీజ్ అయ్యింది.
అయితే ఈ సినిమాకి దర్శకుడు వెంకట్ ప్రభు. విజయ్ సీఎం అవుతారని ముందుగాను భావించి ఆయన ఆ సినిమాలో విజయ్ నడిపిన కారుకు ఈ నెంబర్ ప్లేట్ ను ఏర్పాటు చేశారు. కాగా ఆ నంబర్ లో టీఎన్ 07 సీఎం 2026 ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే విజయ్ సీఎం కాకముందే .. ఆయన సీఎం అవుతారని ఊహించి ఈ నెంబర్ ప్లేట్ ని డీజైన్ చేయించి సినిమాలో ఊపయోగించారు.
ప్యూచర్ ను ముందే ఊహించిన వెంకట్ ప్రభును 2026 ఎన్నికల ఫలితాల తరువాత ఫ్యాన్స్ అభినందనలతో ముంచెత్తారు. దాంతో అదే నెంబర్ ప్లేట్‌ను ఫ్రేమ్‌గా మార్చి సీఎం విజయ్‌కి అందజేశారు. విజయ్ సైతం ఆ కానుకను సంతోషంతో అందుకున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
